ఉద్దానం కిడ్నీ సమస్య ఘోర విపత్తు

0
92

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఘోరవిపత్తు లాంటింది. ఒక ప్రాంతంలో వేల మంది చనిపోతుంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధీ ఎందుకు దృష్టిపెట్టడం లేదు. సమస్యను పరిష్కారం దిశగా ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదు? భావి తరాలకు కూడా కిడ్నీ వ్యాధుల ముప్పు పొంచి ఉండడం తీవ్రంగా కలచి వేస్తోంది. పుష్కరాలకు, రాజధాని నిర్మాణానికి వేల కోట్లు ఖర్చుపెడతారు. కానీ అంతమంది మనుషులు చనిపోతున్నా.. ఎందరో  అనాథలవుతున్నా పట్టించుకోకపోవడం బాఽధాకరం. ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.6 వేల కోట్లు. ఇందులో రూ.100 కోట్లు కేటాయించి ఉద్దానం కిడ్నీ సమస్యను ఇకనైనా పరిష్కరించండి. 48 గంటల్లోగా ఈ ప్రాంత బాధితులకు, అనాథలకు తక్షణ సాయంగా ఏం చేస్తారో ప్రకటించండి’ అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్రప్రభుత్వానికి గడువు విధించారు. కిడ్నీవ్యాధుల మూలాలపై అధ్యయనానికి పార్టీ తరఫున కమిటీ వేస్తున్నామని, 15 రోజుల్లో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు స్వయంగా అందిస్తానని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఉద్దానం కిడ్నీ బాధితులతో స్థానిక మణికంఠ థియేటర్‌లో ముఖాముఖి నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌కు తమ బాధలు వివరించడానికి పెద్దఎత్తున బాధితులు ఇచ్చాపురం వచ్చారు. వీరిలో ఐదుగురిని ఆయన వేదికపై పిలిచారు. ఓ వృద్ధురాలు, తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడు, మరికొందరు వృద్ధులు వేదికపైకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖాముఖి అనంతరం పవన రోడ్‌ షో నిర్వహించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here