ఉత్తర ధ్రువంలో అకాల ఉష్ణం

0
28

లండన్: క్రిస్మస్ వేళ సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కంటే ఉత్తర ధ్రువం లో అత్యధిక స్థాయిలో 20 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ అకాల వేడి వాతావరణానికి మానవ కార్యకలాపాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ ఏడాది నవంబరు, డిసెంబర్‌లో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఇలాంటి వేడి వాతావరణం ఏర్పడటం చాలా అరుదని, 1000 ఏండ్లకు ఒక్కసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ నుంచి వేడిగాలులు స్పిట్స్‌బర్గన్ మీదుగా ఉత్తర ధ్రువం వైపునకు వీయడమే వాతావరణం వేడెక్కడానికి కారణమని తెలిపారు.

LEAVE A REPLY