ఉత్తర కొరియాపై అమెరికా సందేహం

0
14

దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను గురిచూసి కొట్టే ఉత్తర కొరియా ఆయుధాలకు ఇంధనం ఎక్కడి నుంచి వస్తోంది? మొదట్లో ఈ రాకెట్‌ ఇంధనం చైనా, రష్యా నుంచి సరఫరా అయ్యేదని అమెరికా గూఢచార సంస్ధలు భావిస్తున్నాయి. అన్‌సిమిట్రికల్‌ డైమెధల్‌ హైడ్రజీన్‌ (యూడీఎంహెచ్‌) అనే ఈ శక్తిమంతమైన ఇంధనం క్షిపణులు, రాకెట్లు వంటి ఆయుధాలను ప్రయోగించడానికి అవసరం. కమ్యూనిస్ట్‌ కొరియాపై ఆంక్షలకు ముందు యూడీఎంహెచ్‌ ఈ రెండు దేశాలూ గుట్టచప్పుడుకాకుండా అందజేసేవి.

ఇప్పుడు ఉత్తర కొరియాయే సొంతగా ఈ ఇంధనం ఉత్పత్తిచేసే స్ధాయికి చేరుకుని ఉంటుందని కూడా అమెరికా సర్కారు అంచనావేస్తోందని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది. అయితే, యూడీఎంహెచ్‌ తయారీకి అవసరమైన పదార్ధాలను చైనా, రష్యా ఇంకా రహస్యంగా రవాణాచేస్తున్నాయా? అనే విషయం తేల్చడానికి అమెరికా ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఈ ముడిపదార్ధాల సరఫరాను ఆంక్షల ద్వారా ఆపడానికిగాని, విద్రోహ చర్యల ద్వారా దెబ్బదీయడానికిగాని ఏంచేయాలో భద్రతా సంస్ధలు యోచిస్తున్నాయి.

LEAVE A REPLY