ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు సీబీఐ సమన్లు జారీ

0
21

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 26న తమ ఎదుట హాజరుకావాలని కోరింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ హరీశ్ రావత్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చినట్లు తెలిపే స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపడ్డాయి. దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ కేసు లో మొదటిసారి మే 24న హరీశ్ రావత్‌ను సీబీఐ ఐ దు గంటలపాటు ప్రశ్నించింది. ప్రస్తుతం మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సీబీఐ నోటీసు లు జారీ చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

LEAVE A REPLY