ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం

0
32

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో సంక్షోభం నాటకీయ ఫక్కీలో సద్దుమణిగింది. తన కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్, సోదరుడు రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎస్పీ అధినేత ములాయం 24 గంటలలోనే ఎత్తివేశారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎస్పీలో చీలిక రానివ్వనని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఆజంఖాన్ శపథంచేశారు. ఎస్పీకి వ్యతిరేకంగా జరిగిన కుట్ర విఫలమైందన్నారు. శనివారం ఉదయం అఖిలేశ్ నివాసానికి వచ్చి ఆయనతో సమావేశం అయ్యారు. ములా యం, అఖిలేశ్‌లతో ఆర్జేడీ అధినేత లాలూ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఘర్షణకు దిగి పార్టీ చీలి విడివిడిగా పోటీచేస్తే, ప్రత్యర్థులకు ప్రత్యేకించి బీజేపీకి లబ్ధి చేకూరుతుందని వారికి హితవుచెప్పారు.

LEAVE A REPLY