ఉగ్రవాదుల మరణ శిక్షలకు.. పాక్ ఆర్మీ చీఫ్ గ్రీన్ సిగ్నల్

0
26

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా 30 మంది ఉగ్రవాదుల మరణ శిక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2014లో పెషావర్ స్కూల్‌పై దాడి చేసిన తాలిబాన్లు, విద్యార్థులతో సహా 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడితోపాటు పాటు మరికొన్ని కేసుల్లో అరెస్టైన ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ కోర్టులు మరణ శిక్ష విధించాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా బుధవారం తన ఆమోదం తెలిపారు. దీంతో ఉగ్రవాదులకు మరణ శిక్షలు అమలు చేయనున్నారు. అయితే పాక్ ప్రతిపక్ష పార్టీలతోపాటు, మానవ హక్కుల సంఘాలు దీనిపై మండిపడ్డాయి. మరణ శిక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

LEAVE A REPLY