ఈ వృద్ధ గోరిల్లా 60 ఏట అడుగుపెట్టింది.

0
30

అమెరికాలో ఎక్కువకాలం జీవించి ఉన్న గోరిల్లాగా రికార్డును సొంతం చేసుకొన్న దీని పేరు కోలో. గురువారం ఈ వృద్ధ గోరిల్లా 60 ఏట అడుగుపెట్టింది. ప్రతిష్ఠాత్మక కొలంబస్ జంతుప్రదర్శనశాలలో ఉంటున్న కోలో ముగ్గురు పిల్లలకు తల్లి. 16 గోరిల్లాలకు అమ్మమ్మ. 12 గోరిల్లాలకు తాతమ్మ. మరో ముగ్గురికి ముత్తవ్వ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో జన్మించిన తొలి గోరిల్లాగా కోలో ఓ ఘనతను కూడా సొంతం చేసుకొన్నది. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించామని, నిరంతర వైద్య పర్యవేక్షణ కారణంగానే కోలో జీవితకాలం పెరిగిందని వైద్యులు వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here