ఈ ప్రపంచాన్ని ఊపేస్తాం!

0
14

అరెస్ట్ అంతా మన మంచికే అనుకోవాలి అని అంటున్నాడు.. రూ.3,700 కోట్ల ఆన్‌లైన్ క్లిక్కుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అనుభవ్ మిట్టల్(26).. పోలీసులు అరెస్ట్ చేస్తే ఆందోళన చెందవద్దు.. అరెస్ట్ వల్ల మనం మరింత ప్రచారం పొందుతాం.. అరస్టైతే ఒక్కరోజులోనే మన గురించి దేశానికి తెలిసే అవకాశం వచ్చిందని భావించాలని గట్టిగా చెప్తున్నాడు. నేను అరెస్టయ్యాయని బాధపడకండి. ఇదో దుర్దశ అనుకోండి.. బయటకు వస్తాం.. మళ్లీ ఈ ప్రపంచాన్ని ఒక్క ఊపు ఊపేస్తాం అంటూ తన సంస్థ అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ కీలక సిబ్బందికి, పెట్టుబడిదారులకు మొబైల్ ఫోన్ కెమెరాల ద్వారా రికార్డు చేసిన వీడియో సందేశాలు పంపాడు. గతవారం తాను అరెస్ట్ అయిన తరువాత అట్లా ఆయన పంపిన వీడియో సందేశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒకనాడు ఖాదీకి ప్రఖ్యాతిగాంచిన పిల్ఖువా పట్టణంలో మిట్టల్ పెరిగాడు. ఘజియాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి ఆన్‌లైన్ వ్యాపారాలు పెంచడానికి నకిలీ క్లిక్కుల వ్యాపారం చేసి కేవలం రెండేండ్లలోనే కోటీశ్వరుడయ్యాడు.

శారదా స్కాం కంటె పెద్దది..

శారదా చిట్‌ఫండ్ స్కాం కంటె క్లిక్కుల స్కాం పెద్దది. శారదా స్కాం విలువ రూ.1700 కోట్ల నుంచి రూ.2000 కోట్లు అయితే.. క్లిక్కుల స్కాం విలువ రూ. 3,728 కోట్లు. దాదాపు 7 లక్షల మంది నెట్‌యూజర్లు మిట్టల్ ముఠాను నమ్మి మోసపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here