సూర్య, చంద్ర గ్రహణాలనేవి తరచుగా వస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువగా వచ్చేవి పాక్షిక గ్రహణాలు మాత్రమే. సంపూర్ణ గ్రహణాలు ఎప్పుడో గానీ ఏర్పడవు. చాలా అరుదుగా అవి వస్తాయి. అయితే అలాంటి అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం ఒకటి ఈ నెల 21వ తేదీన ఏర్పడనుంది. అలా అని చెప్పి భూగోళంపై అన్ని ప్రాంతాల్లో ఉండే వారికి ఆ గ్రహణం కనిపిస్తుందా..? అంటే.. కాదు, కేవలం అమెరికాలో.. అది కూడా కొన్ని ప్రాంతాలకు చెందిన వారికే ఈ గ్రహణం కనిపించనుంది.