ఈ చెత్త పాస్‌వర్డ్‌లను మీరు వాడుతున్నారా..?

0
36

ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, సోషల్ యాప్స్, ఇతర సైట్లు… ఇలా చాలా చోట్ల యూజర్లు తమ తమ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేసి ఆయా సేవల్లోకి లాగిన్ అవుతారు. ఈ క్రమంలోనే యూజర్లందరూ తాము గుర్తుంచుకునేందుకు వీలుగా ఉండే పాస్‌వర్డ్‌లను ఆయా లాగిన్‌లకు పెట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం రెగ్యులర్‌గా మనం వాడే పదాలను, అంకెలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటారు. ఉదాహరణకు… 1234, 5678… ABCD… ఇలా అన్నమాట. దీంతో అలాంటి అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతాయి. ఇలా సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే ఎప్పటికైనా ముప్పు తప్పదు. అయినప్పటికీ చాలా మంది యూజర్లు ఇంకా ఇలాంటి పాస్‌వర్డ్‌లనే పెట్టుకుంటున్నారట. ఐటీ సెక్యూరిటీ సంస్థ కీపర్ సెక్యూరిటీ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.

ఈ మధ్య కాలంలో హ్యాకింగ్‌కు గురైన యూజర్ల అకౌంట్లు, లీకైన వారి పాస్‌వర్డ్‌లను కొన్ని లక్షల సంఖ్యలో విశ్లేషించింది కీపర్ సెక్యూరిటీ. దీంతో 2017 సంవత్సరానికి గాను యూజర్లు వాడుతున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను ఆ సంస్థ ప్రకటించింది. అందులో 123456 అనే పాస్‌వర్డ్ మొదటి స్థానంలో ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది యూజర్లు పాస్‌వర్డ్‌గా వాడుతున్నారట. దీని తరువాతి స్థానాల్లో వరుసగా 123456789, qwerty, 12345678, 111111, 1234567890, 1234567, password, 123123, 987654321, qwertyuiop, mynoob, 123321, 666666, 18atcskd2w, 7777777, 1q2w3e4r, 654321, 555555, 3rjs1la7qe, google, 1q2w3e4r5t, 123qwe, zxcvbnm, 1q2w3e అనే పాస్‌వర్డ్‌లు నిలిచాయి. వీటిని చాలా మంది పాస్‌వర్డ్‌లుగా ఇప్పటికీ వాడుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here