‘ఈ క్షణమే’. సాయిదేవ రామన్‌ దర్శకుడు

0
15

నురాగ్‌, శ్వేత నటిస్తున్న చిత్రం ‘ఈ క్షణమే’. సాయిదేవ రామన్‌ దర్శకుడు.    పి.లక్ష్మణాచారి నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ క్లాపిచ్చారు. న్యాయమూర్తి రామారావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘కాలేజీ నేపథ్యంలో నడిచే ప్రేమకథ. అబ్బాయిని ద్వేషించిన అమ్మాయి, మళ్లీ ఆ అబ్బాయినే ప్రేమిస్తుంది. ద్వేషం ప్రేమగా ఎలా మారిందన్నది ఆసక్తికరం. పాటలు కథానుగుణంగానే వస్తాయ’’ని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మార్చి రెండో వారం నుంచి ఏకధాటిగా కొనసాగించి, ఒకే ఒక్క షెఢ్యూల్‌తో సినిమాని పూర్తిచేస్తామ’’న్నారు. ఈ చిత్రానికి మాటలు: హేమంత్‌ కార్తీక్‌

LEAVE A REPLY