ఈ ఏడాది వృద్ధిరేటు 6.5 శాతమే!

0
19

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.5 శాతానికి పరిమితం కానున్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.6 శాతంతో పోలిస్తే ఒక శాతానికిపైగా పడిపోనున్నదని పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఆర్థిక సర్వే-2017లో వెల్లడించింది. నోట్ల రదు ప్రభావం ఈ ఏడాది వృద్ధిరేటుకు అర శాతం మేర గండికొట్టవచ్చని తెలిపింది. అయితే వృద్ధికి మరింత ఊతమివ్వాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పన్నులను తగ్గించాలని సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2017-18) మాత్రం వృద్ధి 6.75 శాతం నుంచి 7.5 శాతం మధ్యలో నమోదుకావచ్చని సర్వే ఆశాభావం వ్యక్తంచేసింది. కేవలం వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గిస్తే సరిపోదని, కార్పొరేట్ పన్నులతోపాటు అధిక ఆదాయం కలిగిన వారిపై విధిస్తున్న పన్నుల్లోనూ కోత పెట్టాలని పేర్కొంది. అధిక ఆదాయం కలిగివున్నవారు ఎవరనేదానిపై సర్వే స్పష్టతనివ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here