ఈ ఏడాది నుంచే నరసరావుపేట జేఎన్ టీయూలో తరగతులు

0
18
స్వంత రాజధాని నుంచే పరిపాలన మనందరికీ గర్వకారణమని కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే అన్నారు. సచివాలయ శాశ్వత పరిపాలన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతృప్తికర విషయమని వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు.

ప్రజల భాగస్వామ్యంతోనే ..

ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజలు భాగాస్వామ్యమైనప్పుడే లక్ష్యాలను సాధించగలమని తెలిపారు. యువత ఉజ్వల భవిత కోసం దేశంలోనే ఖ్యాతి గాంచిన విద్యాలయాల ఏర్పాటులో భాగంగా వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్మాణం కోసం ఐనవోలులో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. నరసరావుపేట జేఎనటీయూలో ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర కొరతను తీర్చేందుకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలులో గుంటూరు జిల్లా సాధిస్తోన్న ప్రగతిని శాఖల వారీగా కలెక్టర్‌ సభకు నివేదించారు.

LEAVE A REPLY