ఈసీకి అఖిలేశ్‌ వర్గం అఫిడవిట్లు

0
21

సమాజ్‌వాదీ పార్టీలో మెజారిటీ సభ్యుల మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ గ్రూప్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల చిహ్నం సైకిల్‌ను దక్కించుకునేందుకు మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీ్‌సబేరర్ల సంతకాలు చేసిన అఫిడవిట్లను ఈసీకి ఆయన సన్నిహితుడు రాంగోపాల్‌ యాదవ్‌ శనివారం సమర్పించారు. 229మంది ఎమ్మెల్యేలకూ 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలలో 56 మంది, 24 మంది ఎంపీలలో 15 మంది, 5 వేలమంది ప్రతినిధులలో దాదాపు 4600మంది డెలిగేట్లు అఖిలేశ్‌కు మద్దతుగా సంతకాలు చేశారని, ఇవన్నీ మొత్తం లక్షన్నర పేజీలు దాకా ఉన్నాయని రాంగోపాల్‌ చెప్పారు. కాగా, సమాజ్‌వాదీ(ఎస్పీ)లోని రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరలేదు. ములాయం, అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు శనివారం లఖ్‌నవ్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

LEAVE A REPLY