ఈగ, మిర్చి చిత్రాలకు అవార్డుల పంట

0
31

తెలుగు సినీ రంగంలో ప్రతిభ చూపిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే నంది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అమరావతిలో ప్రకటించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఈ నంది అవార్డులను అందజేయనున్నారు. 2012 సంవత్సరానికి ఉత్తమ నటుడుగా నాని, ఉత్తమ నటిగా సమంత, ఉత్తమ చిత్రంగా ఈగ, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎటో వెళ్లిపోయింది మనసు, తృతీయ ఉత్తమ చిత్రంగా మిథునం, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఇష్క్ చిత్రాలు ఎంపికయ్యాయి. 2012 సంవత్సరానికిగాను ఉత్తమ సినీ విమర్శకుడిగా మామిడి హరికృష్ణ అవార్డును దక్కించుకున్నారు. ఈగ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, మరియు ఇతర అవార్డులతో కలిపి మొత్తం తొమ్మిది అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లి పోయింది మనసుకు నాలుగు అవార్డులు దక్కాయి. 2013 సంవత్సరానికిగాను ఉత్తమ చిత్రంగా మిర్చి, ఉత్తమ నటిగా అంజలి పాటిల్ (నా బంగారు తల్లి), ఉత్తమ దర్శకుడిగా దయా కొడవటిగంటి( అలియాస్ జానకి) అవార్డుల్ని దక్కించుకున్నారు. మిర్చి ఆరు అవార్డుల్ని దక్కించుకుంది.

బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ మరోమారు ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో 2012 సంవత్సరానికిగాను ఆయన ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. 2009, 2010 సం॥లో కూడా ఉత్తమ సినీ విమర్శకుడిగా ఆయన నంది అవార్డుల్ని స్వీకరించారు. మామిడి హరికృష్ణ గతంలో నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు. కవిగా, సినీ విశ్లేషకుడిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా ఆయన పేరు తెచుకున్నారు. ప్రస్తుతం మామిడి హరికృష్ణ తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here