ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి

0
22

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన కోసం జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పలు సందేశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు తనను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే బావుంటుందని చెప్పారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు నన్ను మోదీ గారితో మాట్లాడితే బాగుంటుందన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే.. నేను మోదీ గారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను. కానీ మీ ఎంపీలు అందరూ పార్లమెంట్లో ఆయనతో పాటు కూర్చుంటున్నారు కదా.. మరి వారేంచేస్తున్నారు..?? మీడియా ముందుకు వచ్చి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని చెప్పడం తప్పా. అసలు ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి. ప్రజలు అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా.. మీరు ఆ పని చేయలేదు కాబట్టే కదా.. ఈ రోజు యువత రోడ్ల మీదకు వస్తున్నారు. మీరు ఏమీ చేయకండి.. యువతను ఏమీ చేయనీకండి. మరి దీనికి పరిష్కారం ఏమిటి..?’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY