ఇలా నోరు తెరవగానే.. అలా..

0
25

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇలా నోరు విప్పారో లేదో అలా ప్రత్యర్థి టెలికం కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పతనమైన మొత్తం షేర్ల విలువ దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంచలన ఆఫర్‌తో ముందుకు వచ్చిన రిలయన్స్ జియో.. వచ్చీ రావడంతోనే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగివచ్చాయి. పోటీని తట్టుకునేందుకు టారిఫ్‌లను విపరీతంగా తగ్గించాయి. ఇక జియో వెల్‌కమ్ ఆఫర్ ఈనెల 30కి ముగుస్తుండడంతో తాజాగా ఈరోజు ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈరోజు ముంబైలో ముకేశ్ అంబానీ ‘హ్యాపీ న్యూ ఇయర్’గా నామకరణం చేసిన సరికొత్త ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY