ఇరాన్‌లో రైలు ప్రమాదం 31 మంది దుర్మరణం

0
22

ఓ ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న మరో ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన శుక్రవారం ఇరాన్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోగా 70 మందికిపైగా గాయపడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి మష్షాద్ పట్టణం వెళ్లే ప్రధాన రైల్వేలైనుపై ఉన్న స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నవంబర్‌లో ఉండే తీవ్రమైన చలి వల్ల పొరపాటున ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేస్టేషన్‌లో ఆపినట్టు ఈ ప్రాంత గవర్నర్ మహ్మద్ రెజాకబ్బాజ్ పేర్కొన్నారు. వెనుక నుంచి రైలు ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన రెండు కోచ్‌లలో మంటలు చెలరేగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here