ఇరాక్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం

0
22

ఇరాక్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో దాదాపు 28 మంది మృతిచెందారు. 54 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం సెంట్రల్ బాగ్దాద్‌లోని అల్-సినాక్ మార్కెట్‌లో జరిగింది. మొదట ఓ బాంబు పేలిందని, తర్వాత ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని, దీంతో మృతుల సంఖ్య పెరిగిందని చెప్పారు. సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టామని, క్షతగ్రాతులను దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. రెండు పేలుళ్లు వరుసగా జరుగడంతో ఆ ప్రాంతమంతా నెత్తుటితో తడిచిపోయిందని, పలు దుకాణాలు నేలమట్టమయ్యాయని వివరించారు. పేలుళ్లకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని, అయినప్పటికీ ఐఎస్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అన్నారు.

LEAVE A REPLY