ఇయర్‌ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్… 10 మందికి జైలు.. పోలీసుల వైఖరిపై నిరసన

0
9

ఇయర్‌ ఫోన్‌లు వాహనచోదకులకు చుక్కలు చూపించాయి. రాత్రికి రాత్రే ట్రాఫిక్‌ పోలీసులు అమలు చేసిన కొత్త నిబంధన వాహనదారులను సరాసరి జైలుకు పంపించింది. ఇయర్‌ ఫోన్‌లు వాడుతూ వాహనాలు నడుపుతున్న పది మందికి స్పెషల్‌ ఎంఎం కోర్టు ఒకరోజు జైలుతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. తీర్పు విన్న వాహన చోదకులు షాక్‌కు గురయ్యారు. మరికొందరు ఇంత చిన్న విషయానికి జైలు ఏంటీ! అంటూ మనోవైదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధన పెట్టారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసినా…చెవిలో ఇయర్‌ ఫోన్‌లు పెట్టుకున్నా నేరం కింద పరిగణిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనపై నగర వాసులకు అవగాహన వచ్చే వరకూ మినహాయింపు ఇస్తే బాగుండేది. ఏసీ గదుల్లో ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అప్పటికప్పుడు పోలీసులు అమలు చేశారు. ఇయర్‌ ఫోన్‌లు వాడిన వారిపై కేసులు పెట్టి కోర్టులో హాజరుపర్చి వారు జైలుకు వెళ్లేలా చేశారు.

LEAVE A REPLY