ఇబ్బంది లేకుండా అడవి జంతువులతో ఆడుకుంటున్న పాప

0
18

ఉత్తరప్రదేశ్ మోతీపూర్ పరిధిలోని కటర్ణిఘట్ అటవీప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఆ సమయంలో కోతుల గుంపులతో కలిసి జీవిస్తున్న ఎనిమిదేండ్ల బాలిక కనిపించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అడవి జంతువులతో ఆడుకుంటున్న ఆ పాపను ఇన్‌స్పెక్టర్ సురేశ్‌యాదవ్ అతికష్టం మీద అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి దవాఖానలో చేర్పించారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. అయితే ఆ బాలిక అసాధారణంగా ప్రవర్తిస్నుది. జంతువుల్లా రెండు చేతులు, కాళ్లతో నడుస్తున్నది. అంతేకాదు ఆమె ఏమీ మాట్లాడలేకపోతున్నదని..ఏ భాషను అర్థం చేసుకోవడంలేదని వైద్యులు తెలిపారు. మనుషులను చూస్తే భయంతో పరుగు తీస్తున్నదని చెప్పారు. ఆమె శరీరంపై చాలా గాట్లు ఉన్నాయి. దీన్ని బట్టి ఆమె చాలా కాలంగా జంతువులతో కలిసి జీవించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు.

LEAVE A REPLY