ఇప్పటికైతే ఓకే.!

0
21

ప్రస్తుత టీమ్ ఇండియా పరిస్థితి చూస్తుంటే ఎక్కడో కొడుతుంది శీనూ..అని తెలుగు సినిమాలో ఓ కమెడియన్ డైలాగ్ గుర్తుకు రాక మానదు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంతో అంతా బాగుంది అనేలా కనిపిస్తున్నా ఆటగాళ్ల గాయాలతో జట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం కనిపిస్తున్నది. అజేయంగా కాగితంపై ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్న విరాట్‌సేన గాయాల గాధ

నమస్తే తెలంగాణ స్పోర్ట్స్ డెస్క్:విరాట్ సేన వెలిగిపోతున్నది. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టును చితక్కొడుతూ టెస్టు సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్ సహా సెహ్వాగ్ ప్రస్తుత జట్టును ఆకాశానికెత్తుతున్నారు. అచ్చు తనలాగే మూడోస్థానంలో పుజారా అదరగొడుతున్నాడని, రహానే సూపర్ ఆటగాడని, ఇక విరాట్ కోహ్లీ అద్భుత ఆటగాడని ద్రవిడ్ కితాబిస్తున్నాడు. మరోవైపు విదేశాల్లోనూ ఈ జట్టు అద్భుతాలు చేస్తుందని వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పేస్ బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. స్పిన్నర్లు ముగ్గురూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఆకాశమే హద్దుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టు మినహా ఇప్పటివరకు టీమ్ ఇండియా ఎప్పుడూ తడబడలేదని మాజీ ఆటగాళ్లు గణాంకాలు వల్లెవేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here