ఇప్పటికే రాష్ట్రంలో మూడు సెల్ కంపెనీలు ఉత్పత్తి

0
22

తెలంగాణ: స్వరాష్ట్రం సాధించిన అనంతరం అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఈ క్రమంలో నూతన సాంకేతిక విప్లవానికి చిరునామాగా మారిన సెల్‌ఫోన్ల తయారీకి కేంద్రంగా మారింది. ఇప్పటికే మూడు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా.. తాజాగా మరో ప్రముఖ సంస్థ తెలంగాణను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నది. తద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకు దక్కుతున్నాయి. దేశీయ దిగ్గజమైన ఇంటెక్స్ సంస్థ వచ్చే ఏడాది ప్రథమార్థంలో తన ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మూడు ప్రఖ్యాత సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాయి. విమానాశ్రయం సమీపంలో మైక్రోమాక్స్ సంస్థ సెల్‌ఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రూ.350 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి.

LEAVE A REPLY