ఇన్ఫోసిస్ ఉద్యోగిని దారుణహత్య

0
17

ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని దారుణహత్యకు గురయ్యారు. కంపెనీ కార్యాలయంలో విధుల్లో ఉండగానే హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడైన సెక్యూరిటీ గార్డు, అసోంకు చెందిన భాబెన్ సైకియా(26)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఫుణెలోని హింజేవాడి రాజీవ్‌గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయం ఉన్నది. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన కే రాసిల రాజు(23) ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బెంగళూరు కార్యాలయంలో పనిచేసే రాసిల ఒక ప్రాజెక్టు పనిమీద ఇటీవల పుణె బ్రాంచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో రాసిల విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డు భాబెన్ సైకియా అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో దూరంగా ఉండాలని రాసిల హెచ్చరించారు. ఆదివారం కూడా ఆమె విధులకు హాజరయ్యారు. రాసిల పనిచేసే దగ్గరకు వచ్చిన సైకియా తనపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దని కోరాడు. దానికి ఆమె ససేమిరా అని కాన్ఫరెన్స్ హాలులోకి వెళ్లారు. ఆమె వెనుకాలే హాలులోకి ప్రవేశించిన నిందితుడు కంప్యూటర్ వైరును మెడకుచుట్టి ఆమె ముఖంపై దాడిచేసి గొంతునులిమి చంపేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here