ఇద్దరు భారతీయ జవాన్ల హత్య; తలలు నరికివేత

0
39

పాకిస్థాన్ సైన్యం మరోసారి రాక్షసకృత్యానికి తెగబడింది. ఇద్దరు భారత జవాన్లను హత్య చేయటమేగాక వారి తలలు నరికి తన పైశాచిక ప్రవృత్తిని చాటుకున్నది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణరేఖ (ఎల్‌ఓసీ) వద్ద సోమవారం ఉదయం.. పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్ యాక్షన్‌టీం భారత భూభాగంలోకి 250 మీటర్లకుపైగా చొచ్చుకొచ్చి ఈ దురాగతానికి పాల్పడింది. రెండు ఫార్వర్డ్ పోస్టులపై పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నప్పుడు.. ఆ రెండు పోస్టుల మధ్య పెట్రోలింగ్ చేస్తున్న భారత జవాన్లపై బోర్డర్ యాక్షన్ టీం హఠాత్తుగా దాడి చేసింది. దీనిపై భారతసైన్యం తీవ్రంగా స్పందించింది. ఈ దారుణ చర్యపై తగిన విధంగా స్పందిస్తాం అంటూ హెచ్చరించింది. పాక్ దుశ్చర్య అనాగరికతకు అత్యంత క్రూరమైన నిదర్శమని, దీనికి సైన్యం బదులిస్తుందని రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. పాక్ చర్యకు ప్రతీకారంగా సోమవారం రాత్రి భారత జవాన్లు పాక్‌కు చెందిన రెండు బంకర్లను ధ్వంసం చేసి ఏడుగురు పాక్ సైనికులను హతమార్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY