ఇది ప్రజా వ్యతిరేక చర్య.. ఈ కష్టాలు ఇప్పుడే తీరవు: రాహుల్‌గాంధీ

0
25

పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న చర్య ఆర్థిక దిగ్బంధంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. నోట్ల రద్దు కారణంగా తలెత్తిన ఇబ్బందులు ఈనెల 30 తరువాత తొలగిపోతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్తున్నదంతా ఒట్టిమాటేనని అన్నారు. ఆరేడు నెలల కంటే ఎక్కువ రోజులే ఉంటాయని చెప్పారు. రాజస్థాన్‌లోని బారన్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుడూ, ఈ ఆర్థిక నిర్బంధం పేదలు, రైతులు, కార్మికులనే ఎక్కువగా ఇబ్బందులపాలు చేస్తూనే ఉంటుందన్నారు. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా రాహుల్ దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ సర్కార్ మాదిరిగా సీఎం వసుంధరరాజె ప్రభుత్వం కూడా గిరిజనుల, దళితులు, మహిళలకు వ్యతిరేకంగా, సంపన్నులకు అనుకూలంగా పని చేస్తున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here