ఇది గొప్ప ఆలోచన

0
23

శత్రువుల నుంచి దేశాన్ని రక్షించేందుకు నిరంతరం శ్రమించే సైనికుల కోసం బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ చేసిన కొత్త ఆలోచనకు భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ మద్దతు తెలిపారు. దేశం కోసం పోరాడే క్రమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు అక్కీ ఓ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ట్విటర్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై భజ్జీ స్పందిస్తూ ‘ఇదొక గొప్ప ఆలోచన. దీనికి నేను అండగా ఉంటాను. మన సోదరుల కోసం దీన్ని మనం ప్రారంభిద్దాం.. జైహింద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ఎప్పుడూ ముందుంటారు. వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పుడు యాప్‌ను ప్రవేశపెట్టి జవాన్లకు ప్రజల విరాళాలు నేరుగా చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యాప్‌ ఏంటి? ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని మాత్రం అక్కీ ఇంకా ప్రకటించలేదు.

LEAVE A REPLY