ఇటలీలో మంచు చరియలు విరిగిపడి 30 మంది మృతి

0
19

భూకంపం ప్రభావంతో భారీ మంచు శకలం పర్వత ప్రాంతంలోని ఓ హోటల్‌పై విరిగిపడటంతో 30 మంది మృత్యువాతపడ్డారు. గురువారం ఇటలీ పెస్కారా ప్రావిన్స్‌లోని గ్రాన్ సాసో పర్వతం అడుగు భాగంలో ఉన్న రిగోపియానో అనే చిన్న హోటల్‌పై భారీగా మంచు చరియలు విరిగి పడ్డాయి. అంతకుముందు రోజు ఆ ప్రాంతంలో నాలుగుసార్లు భూమి కంపించడంతో పర్వత శిఖరాలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు. భూకంపం నేపథ్యంలో ప్రమాదం జరిగి హోటల్‌లో ఉన్న పర్యాటకులు, సిబ్బంది సుమారు 30 మృత్యువాత పడ్డట్టు ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేర్కొంది. రెండు మీటర్ల ఎత్తుతో ఉన్న భారీ పర్వత శకలం చిన్న హోటల్‌పై పడిపోయింది. అందులో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు నిపుణులైన పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉండటంతో అక్కడికి వెళ్లడం, సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది అని స్థానిక మీడియా ఏజెన్సీలు పేర్కొన్నాయి. మంచు శకలం ధాటికి హోటల్ 10 మీటర్ల మేర ముందుకు జరిగింది. హోటల్‌లో ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని సహాయక బృందాలు సర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here