ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు

0
23

సైరస్‌ మిస్త్రీపై టాటా సన్స్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. పేనుకు పెత్తనమిస్తే.. రీతిన ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేకాకుండా, చివరకు టాటా సన్స్‌ను వ్యవస్థాత్మకంగానే బలహీనపరచాలని, వాటాదారుల సంపద ఊడ్చుకుపోవాలని యత్నించాడని ఆరోపించింది. మిసీ్త్ర సెలక్ట్‌కమిటీని తప్పుదోవ పట్టించి చైర్మన్‌ అయ్యాడని, చైర్మన్‌ అయ్యే సమయంలో ఇచ్చిన మాటలన్నీ తప్పాడని విమర్శలు గుప్పించింది. త్వరలో గ్రూప్‌ కంపెనీల బోర్డు సమావేశాలు జరగనున్న వేళ మిసీ్త్ర తొలగింపునకు సంబంధించి కీలక నిజాలను వెల్లడించాలని నిర్ణయించినట్లు టాటాసన్స్‌ పేర్కొంది. 2011లో రతన్‌టాటా వారసుడిగా కొత్త చైర్మన్‌ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీని మిసీ్త్ర తప్పుదోవ పట్టించాడని టాటా సన్స్‌ దుయ్యబట్టింది. కమిటీ ముందు టాటా గ్రూప్‌ అభ్యున్నతికి తనవద్ద అద్భుత ప్రణాళికలున్నాయని పెద్ద పెద్ద మాటలు చెప్పాడని, అన్నింటికన్నా ముఖ్యంగా టాటాల సామ్రాజ్యానికి సరిపోయేలా మేనేజ్‌మెంట్‌ నిర్మాణాన్ని విస్తృతం చేస్తానన్నాడని తెలిపింది. కేవలం ఈ మాటలు నమ్మే సెలెక్ట్‌ కమిటీ అంతిమంగా మిస్త్రీని ఎంపిక చేసిందని తెలిపింది.

LEAVE A REPLY