ఇక భారత్‌తో ఆడే ప్రతీ జట్టు ఆఫ్గాన్‌తో ఆడాల్సిందే: బీసీసీఐ

0
8

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ పర్యటనలో ఉన్న ఆయన ఇకపై భారత్ పర్యటనకు వచ్చే ప్రతి అంతర్జాతీయ జట్టు ఆఫ్గానిస్తాన్‌తో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని పేర్కొన్నారు. ఆఫ్గానిస్తాన్ జట్టుకి అంతర్జాతీయంగా మరింత పేరు వచ్చేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆఫ్గానిస్తాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ఛైర్మన్, అధికారులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా క్రికెట్ సంబంధాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ ఛైర్మన్ అతిఫ్ మషాల్ మాట్లాడుతూ ‘‘ఆఫ్గానిస్తాన్‌కి ఇప్పుడు ఐసీసీ సభ్యత్వం వచ్చింది. రానున్న రోజుల్లో మేం బీసీసీఐతో మా సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకొని, రెండు బోర్డులు కలిసి పని చేసి మా దేశంలో క్రికెట్‌ని మరింత అభివృద్ధి చేసుకుంటాం’’ అని తెలిపారు.b

LEAVE A REPLY