ఇక నో కాంప్రమైజ్‌

0
19

‘‘చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలన్నది నా ఆశ. నాన్నగారేమో చదువుకే మొదటి ప్రాధాన్యం అనేవారు. లేదంటే 250 సినిమాలు పూర్తయి చాలా కాలమయ్యేది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. వాటితో సమాజానికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. నా వందవ చిత్రం మహోన్నత ఖ్యాతిగల తెలుగు చక్రవర్తి కథ కావడం నా అదృష్టం. కొన్ని కథల విషయంలో చాలాసార్లు కాంప్రమైజ్‌ అయ్యా. ఇటువంటి సినిమా చేశాక ఇకపై కాంప్రమైజ్‌ అయ్యేది లేదు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. అనంతపురం జగన ఆధ్వర్యంలో నిర్వహించిన 100 దేవాలయాల్లో కుంకుమార్చనలు, 28 శివాలయాల్లో రుద్రాభిషేకాలు పూర్తయిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణకు తీర్థ్రపసాదాలు, పూజించిన కుంకుమను అందజేశారు.

LEAVE A REPLY