ఇక ఐఫోన్‌లో కూడా రెండు సిమ్‌లు..?

0
60

ఒకప్పుడు డ్యుయల్ సిమ్‌లతో చైనా ఫోన్లు మార్కెట్‌లో ఏ విధంగా హల్‌చల్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దీంతో అప్పట్లో ఉన్న శాంసంగ్, నోకియా వంటి కంపెనీలు డ్యుయల్ సిమ్ ఫోన్లను వినియోగదారులకు అందివ్వక తప్పలేదు. అనంతరం రంగ ప్రవేశం చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ మార్కెట్‌లో డ్యుయల్ సిమ్ ఫోన్లకు ఉన్న క్రేజ్ సింగిల్ సిమ్‌లకు లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆ ఫోన్లు జనాదరణ పొందాయి. ప్రధానంగా భారత్, చైనాలలోనైతే డ్యుయల్ సిమ్ ఫోన్ల వాడకం దారులే ఎక్కువ. దీంతో అనేక కంపెనీలు డ్యుయల్ సిమ్ ఫోన్ల తయారీ పట్ల శ్రద్ధ చూపిస్తూ వచ్చాయి. ఆ ఫోన్లతోనే వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు అనేక కంపెనీలకు చెందిన ఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్ వచ్చింది. కానీ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లో మాత్రం ఇప్పటి వరకు డ్యుయల్ సిమ్ రానే లేదు. ఇది అమెరికా వంటి దేశాలకు చెందిన పౌరులకు అంతగా ప్రయోజనకరం కాకపోయినా, డ్యుయల్ సిమ్ ఫోన్లను ఎక్కువగా వాడే భారత్, చైనా వంటి దేశాల వినియోగదారులకు ఇబ్బందిని కలిగిస్తుందనే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here