ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌’

0
66

జాతీయ క్రీడల్లాగే ఇకపై ‘ఖేలో ఇండియా’ స్కూల్, కాలేజ్‌ గేమ్స్‌ నిర్వహిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ వెల్లడించారు. ఈనెల 6 నుంచి జరుగనున్న ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్‌ జట్టును మంగళవారమిక్కడ సన్మానిం చారు. ఈ సందర్భంగా రాథోడ్‌ మాట్లా డుతూ ‘దేశ క్రీడల ముఖచిత్రాన్ని మార్చనున్నాం. అందరి సహకారంతో క్రీడల్లో భారత్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. కుర్రాళ్లు చిరు ప్రాయంలోనే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ ఏడాది ‘ఖేలో ఇండియా’ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ను ఈ డిసెంబర్‌లో నిర్వహిస్తాం. అలాగే కాలేజ్‌ గేమ్స్‌ను వచ్చే జనవరిలో నిర్వహిస్తాం. ఇకపై క్రమం తప్పకుండా ప్రతిఏటా ఈ గేమ్స్‌ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here