ఇండోనేషియాలో భారీ భూకంపం, 97 మంది మృతి

0
23

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని ఏసె రాష్ట్రంలో ముస్లింలు అత్యధికంగా ఉండే ఓ ప్రాంతం.. భారీ భూకంపంతో ఒక్కసారిగా చిగురుటాకులా వణికింది. ప్రార్థనలకు సిద్ధమవుతున్న ప్రజలు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. వందల కొద్ది ఇండ్లు, మసీదులు, వాణిజ్య సముదాయాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఎటుచూసినా శిథిలాలే. ఈ పెనువిషాదంలో 97 మంది మృత్యువాత పడ్డారు. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లోని ఏసె రాష్ట్రంలో సంభవించిన శక్తిమంతమైన భూకంపంతో 97 మంది మృతి చెందగా, 200 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. బుధవారం తెల్లవారుజామున పౌరులు ఉదయ ప్రార్థనలకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. వందల కొద్దీ ఇండ్లు, వాణిజ్య సముదాయాలు, మసీదులు పేకమేడల్లా కుప్పకూలాయి. 1000 మందికిపైగా ఆర్మీ, 900 మంది పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY