ఇండియా నుంచి సచిన్‌ ఒక్కడే…

0
13
Indian players Sachin Tendulkar smiles after inspecting the wicket at the MCG in Melbourne, 24 December 2007. India are continuing their preparations for the first Test against Australia, which starts 26 December 2007. RESTRICTED TO EDITORIAL USE PUSH TO MOBILE SERVICES OUT AFP PHOTO/William WEST

కొంత మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ అభిమాన క్రికెటర్లతో కూడిన బెస్ట్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించడం గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ఆల్‌టైమ్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఒక్కడే భారత్‌ నుంచి చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తన తరం ఉత్తమ ఆటగాడిగా తెందుల్కర్‌నే ఎంచుకున్నాడు. స్వాన్‌ తన డ్రీమ్‌ టీమ్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు ఆడుతున్న పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు చోటు కల్పించాడు. అది కూడా 12వ ఆటగాడిగా ఎంపిక చేశాడు.

ఆల్‌టైమ్‌ ఎలెవన్‌..
డాన్‌ బ్రాడ్‌మన్‌, అడమ్‌ గిల్‌క్రిస్ట్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, జాక్‌ హాబ్స్‌, స్వాన్‌, జేమ్స్‌ అండర్సన్‌, గ్రీనిడ్జ్‌, సాబర్స్‌, బ్రియాన్‌ లారా, సచిన్‌ తెందుల్కర్‌, వసీం అక్రమ్‌

LEAVE A REPLY