ఇంట్లో కూర్చోవాల్సిందే!

0
19

‘విజయాలు సాధించడానికి మ్యాజిక్కులేం ఉండవు. ‘నేనేం కష్టపడలేదు… అయినా విజయాన్ని అందుకొన్నా’ అనేవాళ్లు ఒక్కరూ కనిపించరు. ఒకవేళ అలా చెబితే నేను మాత్రం నమ్మను’’ అంటోంది శ్రుతిహాసన్‌. ఇటీవల ‘ప్రేమమ్‌’తో ఓ విజయాన్ని అందుకొంది. ప్రస్తుతం ‘కాటమరాయుడు’లో పవన్‌ కల్యాణ్‌ సరసన నటిస్తోంది. శ్రుతి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం, మనం ఏం చేసినా వాళ్లకు నచ్చడం ఓ వరం. ‘మాస్‌ హీరోలు ఏం చేసినా జనం చూస్తారు’ అని తేలిగ్గా మాట్లాడేస్తాం. అది అంత తేలిక కాదు. దాని కోసం చాలా కష్టపడాల్సిందే. ప్రేక్షకుల్ని మెప్పించినంత కాలం పరిశ్రమలో ఉంటాం. వాళ్లకు నచ్చలేదంటే ఇంట్లో కూర్చోవాల్సిందే. ‘కమల్‌ కూతురు కదా…’ అని ప్రత్యేకంగా చూడరు. నాకేం మినహాయింపులు ఉండవు. చిత్రసీమలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవ్వరిచేత ‘నో’ అనకుండా చూసుకోవడం ఓ కళ’’ అంది.

LEAVE A REPLY