ఇంటర్నేషనల్ క్రిమినల్‌వి.. ఆ హక్కు నీకెక్కడిది’

0
17

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కేవీపీ రామచంద్రారావుకు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాజెక్టు పేరుతో కోట్లకు కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. స్పిల్‌ వే, ఎర్త్ కం రాక్ డ్యాం పనులను ఎందుకు ప్రీక్లోజ్‌ చేయించారో కేవీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంలో ఎవరెంత కమిషన్‌ తీసుకున్నారో విచారణ జరిపిస్తామని, కేవీపీ పాపాలు బయటపెడతాం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సంపదను ఢిల్లీకి మూటలుగా మోసిన వ్యక్తి కేవీపీ అని, ఎఫ్‌బీఐ విచారణలో ఉన్న ఇంటర్నేషనల్‌ క్రిమినల్ అని ఘాటైన విమర్శలు చేశారు. సోనియాతో కలిసి రాష్ట్ర విభజనకు కేవీపీ కుట్ర చేశారని దుయ్యబట్టారు.

LEAVE A REPLY