ఇంజినీరింగ్ చదివిన యువకుడు

0
7

తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని, మాతృభూమిని మరువ కూడదని పెద్దలు చెబుతారు. అయితే ఈ విషయాన్ని మనలో అధిక శాతం మంది పాటించరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఆ యువకుడు మాత్రం అలా కాదు. ఇంజినీరింగ్ పట్టభద్రుడై, ఎంతో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నా తన ఊరి కోసం ఆ ఉద్యోగాన్ని కూడా మానేశాడు. అక్కడి ప్రజల ఇండ్లలో సౌర వెలుగులు నింపుతున్నాడు. అతనే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పరాస్ లూంబా.

పరాస్ లూంబాది జమ్మూ కాశ్మీర్‌లోని లదాఖ్ ప్రాంతం. నైపుణ్యం కలిగిన యువకుడు కావడంతో చిన్నతనంలో ఎంతో పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం లభించింది.అక్కడ ఓ మారుమూల గ్రామంలో పెరిగాడు. అనంతరం నగరానికి మారి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.  కాగా 2012లో అంటార్కిటికాకు విహార యాత్ర నిమిత్తమై అతను వెళ్లాడు. అక్కడే సౌరశక్తి వాడకంపై పలు విషయాలు తెలుసుకున్నాడు. అయితే అలా తెలుసుకోవడమే అతని జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలోనే పరాస్ తన ఊరి వారికి కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు.

LEAVE A REPLY