ఆ సినిమాలు పాడుచేస్తున్నాయి

0
35

పాకిస్థాన్‌లో బాలీవుడ్‌ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. భారత్‌లో బాలీవుడ్‌ సినిమాలు విడుదలైతే ఎంత సందడి ఉంటుందో.. పాకిస్థాన్‌లోనూ అంతే సందడి ఉంటోంది. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌ చిత్రాలకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. సల్మాన్‌ ప్రతీ సినిమా పాకిస్థాన్‌లోనూ హిట్‌ కొడుతోంది. అయితే పాకిస్థాన్‌ గాయని.. నటి రబీ పిర్జాదా మాత్రం బాలీవుడ్‌ను.. సల్మాన్‌ఖాన్‌ను తీవ్రంగా విమర్శిస్తోంది. బాలీవుడ్‌ సినిమాలు యువతను పెడదారిపట్టిస్తున్నాయని మండిపడుతోంది.

ఒకప్పుడు పాకిస్థాన్‌లో చిత్రపరిశ్రమ(లాలీవుడ్‌) అద్భుతంగా ఉండేది. ప్రస్తుతం స్థానిక చిత్రాలకు బదులు బాలీవుడ్‌ సినిమాలను చూడటం మొదలుపెట్టారు. దీంతో లాలీవుడ్‌ మరుగునపడుతోంది. దానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పలువురు పాకిస్థానీ తారలు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా రబీ పిర్జాదా బాలీవుడ్‌పై మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో ఏ చిత్రం విడుదలైనా.. ఆ కథ నేరాల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌ చిత్రాలు. భారతీయ సినిమాలు యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాయి? చూస్తుంటే.. నేరాల్ని ప్రచారం చేస్తున్నట్టు ఉంది. పాకిస్థాన్‌లో లాలీవుడ్‌కి ఆదరణ ఉన్నప్పుడు నీతిమంతమైన.. సామాజిక ధర్మాలను తెలిపే సినిమాలు తీసేవారు. కానీ బాలీవుడ్‌ చిత్రాలు మొత్తం మార్చేశాయ’ని కస్సుబుస్సులాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here