ఆ మాటను నిలబెట్టుకున్నాం

0
26

అందరూ గర్వించదగ్గ సినిమా చేస్తామని ఆడియో వేడుకలో పవన్‌కల్యాణ్‌కు మాటిచ్చాం. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది అని అన్నారు సప్తగిరి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్. డా॥రవికిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్‌పవార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. సప్తగిరి మాట్లాడుతూ సప్తగిరి విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. కష్టపడ్డాను కాబట్టే సినిమా ఖచ్చితంగా విజయవంతమవుతుందని ఆత్మవిశ్వాసంతో విడుదలకు ముందు చెప్పిన మాట నిజమైంది. ప్రేక్షకులంతా సినిమాను గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఈ చిత్రంతో తెలంగాణ నిర్మాతను సినీ పరిశ్రమకు పరిచయం చేశాను. సినిమా చూసిన వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే ఓ వ్యక్తి మాత్రం మా చిత్రంపై దుష్ప్రచారం చేశాడు. తప్పు చేసిన వారిని దేవుడే శిక్షిస్తాడు. సినిమాలను వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదు. కుటుంబాల జోలికి రావద్దు(కన్నీళ్లు పెట్టుకుంటూ) అని తెలిపారు.

LEAVE A REPLY