ఆ ట్వీట్‌ రాజకీయాల గురించి కాదు

0
15

టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా చేసిన ట్వీట్‌ తమిళనాడు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ తమిళనాడులో త్వరలో 234 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. యువకులంతా సిద్ధంగా ఉండండి’ అని సోమవారం మధ్యాహ్నం అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. తమిళనాడులో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 234 కావడంతో.. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుతాయన్న అర్థంలో అశ్విన్‌ ట్వీట్‌ చేసినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే దీనిపై అశ్విన్‌ స్పందిస్తూ.. తాను రాజకీయాలనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. త్వరలో జరగబోయే ఓ ఉద్యోగ మేళా సమాచారాన్ని మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చాడు.

LEAVE A REPLY