ఆ కేంద్ర‌మంత్రి కూతురు వివాహానికి 50 ప్ర‌త్యేక విమానాలు!

0
40

నాగ‌పూర్‌: ఓవైపు దేశంలో నోట్ల‌ర‌ద్దుతో సామాన్యుడు క్యూల‌లో నిల‌బ‌డ‌లేక అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాడు. మ‌రోవైపు వీఐపీల ఇళ్ల‌లో పెళ్లిళ్లు మాత్రం ధూంధాంగా న‌డుస్తున్నాయి. తాజాగా కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూతురి వివాహానికి కూడా అంగ‌రంగ వైభంగా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఆదివారం రాత్రి జ‌రిగ‌బోయే ఈ పెళ్లికి సుమారు ప‌ది వేల మంది అతిథులు హాజ‌రుకానున్నారు. అందులో చాలావ‌ర‌కు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా, ఎల్‌కే అద్వానీ, వ్యాపార‌వేత్త‌లు ముకేష్ అంబానీ, ర‌త‌న్ టాటా, శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రుల్లాంటి వీవీఐపీలే ఎక్కువ‌గా ఉన్నారు. వీరంద‌రి కోసం సుమారు 50 ప్ర‌త్యేక విమానాలు ఆదివారం సాయంత్రం నాగ‌పూర్ వెళ్ల‌నున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here