ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు

0
23

ప్రఖ్యాత టాలీవుడ్‌ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అనేక సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్‌  రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు.  తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్‌ ఉద్యమానికి దాసరి మద్దతు పలికారు. చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీనంబర్‌ 150’ వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY