ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది.

0
37

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. పురుషుల డిఫెండింగ్ చాంపియ‌న్, వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 2 నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. 117వ ర్యాంక్‌లో ఉన్న అనామ‌క ప్లేయ‌ర్ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్టోమిన్ చేతిలో 6-7, 7-5, 6-2, 6-7, 4-6 తేడాతో జొకోవిచ్ పోరాడి ఓడిపోయాడు. 4 గంట‌ల 48 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్‌. ఇప్ప‌టికే ఆరుసార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్‌కు ఇది నిజంగా షాకే. ఇస్టోమిన్ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో మూడో రౌండ్ చేర‌డం ఇదే తొలిసారి. గ‌త ఏడేళ్ల‌లో వందో ర్యాంక్ పైనున్న ప్లేయ‌ర్స్ చేతిలో జొకోవిచ్ ఓడటం ఇది రెండోసారి మాత్ర‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here