ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడతా

0
18

తొడ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం రెండు నెలల నుంచి మైదానానికి దూరంగా ఉన్న టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడాలని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నానని.. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక కావాలని ఆశిస్తున్నానని రోహిత్‌ తెలిపాడు. ‘‘ఆస్ట్రేలియా సిరీస్‌తో నేను పునరాగమనం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాను. నాకు ఇక్కడ అందరూ సాయపడుతున్నారు’’ అని రోహిత్‌ అన్నాడు. భారత్‌.. ఇంగ్లాండ్‌తో ఆడినట్లే ఆస్ట్రేలియాతోనూ ఆడుతుందని.. జైత్రయాత్రను కొనసాగిస్తుందని రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY