ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి

0
19

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ఆయనను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలంగా దాసరి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు మంగళవారం మధ్యాహ్నం ఆపరేషన్‌ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వూపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరారని, డయాలసిస్‌, వెంటిలేటర్‌ సహాయంతో ఆయనకు చికిత్స చేస్తున్నామని తెలుపుతూ కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు మంగళవారం మధ్యాహ్నం బులెటిన్‌ విడుదల చేశాయి. ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆస్పత్రిలో దాసరిని పరామర్శించారు.

LEAVE A REPLY