ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌

0
29

సొంతగడ్డపై పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌‌ను ఆతిథ్య ఆస్ర్టేలియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి, మూడో టెస్ట్‌లో ఆసీస్‌ 220 పరుగులతో గెలిచి సిరీస్‌‌ను 3-0తో కైవసం చేసుకుంది. 465 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. ఓవర్‌నైట్‌ స్కోరు 55/1తో చివరి రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌… బ్యాటింగ్‌ వైఫల్యంతో 244 పరుగులకే కుప్పకూలింది. సర్ఫరాజ్‌ (72), కెప్టెన్‌ మిస్బా (38), షఫిక్‌ (30) మాత్రమే పోరాడారు. యూనిస్‌ ఖాన్‌ పదివేల పరుగుల మార్క్‌కు 23 రన్స్‌ దూరంలో నిలిచిపోయాడు. పేసర్‌ హాజెల్‌వుడ్‌ (3/29), యువ స్పిన్నర్‌ ఒకీఫ్‌ (3/53), నాథన్‌ లియాన్‌ (2/100) పాక్‌ పతనాన్ని శాసించారు. 1999 నుంచి ఆసీస్‌ గడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌‌ల్లో పాక్‌ వైట్‌వా్‌షకు గురికావడం వరుసగా ఇది నాలుగోసారి. డేవిడ్‌ వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, స్టీవ్‌ స్మిత ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌‌’గా నిలిచారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 538/8 (డిక్లేర్‌), పాక్‌ 315 పరుగులు చేశాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 241/2 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

LEAVE A REPLY