ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అశ్విన్ విజృంభణ

0
24

మొహాలీ టెస్ట్‌పై భారత్ మరింత పట్టు బిగించింది. ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై తమ ఆధిపత్యాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఘనవిజయం వైపు అడుగులు వేస్తున్నది. నిఖార్సైన
ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపంగా అశ్విన్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మరో రెండు రోజులు మిగిలున్న టెస్ట్‌లో చేతిలో 6వికెట్లతో 56 పరుగుల వెనుకంజలో ఉన్న కుక్‌సేన ఓటమి నుంచి తప్పించుకోవడం దుస్సాధ్యమే. తొలుత స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, జయంత్‌ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. ఈ ముగ్గురు అర్ధసెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టారు.

LEAVE A REPLY