ఆర్‌కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

0
14

ముంబైలోని ప్రఖ్యాత ఆర్‌కే స్టూడియోలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో డెకరేషన్‌ సామగ్రికి అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. 6 ఫైరింజన్లు, 5 వాటర్‌ ట్యాంకర్‌ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

‘సూపర్‌ డ్యాన్సర్‌’ టీవీ షో సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం కావడంతో సిబ్బందితో పాటూ షోకు సంబంధించిన సభ్యులు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here