ఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో మంత్రి కేటీఆర్

0
28

ప్రభుత్వానికి, ప్రజలకు కార్యకర్తలే వారథులు. పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.38 కోట్లు కేటాయించాం. యాదవ, కుర్మ, ముదిరాజ్, గంగపుత్ర, విశ్వకర్మ, పద్మశాలి, రజక, నాయీబ్రాహ్మణ వంటి అనేక కులాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వీరి సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. పార్టీకి శ్రీరామ రక్షగా నిలబడిన కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులుగా నిలబడి బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి అని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో మంత్రి కేటీఆర్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ లాంటి అసమర్థ పార్టీ చేతికి వెళ్లితే ఎప్పుడో నాశనమయ్యేదన్నారు.

LEAVE A REPLY